రాష్ట్రీయం

తెలంగాణ పోలీసులతో కేంద్ర మంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ పోలీస్ అధికారులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌జోన్ కమిషనర్లతో ఆయన కాసేపు ముచ్చటించారు. నగరంలో రంజాన్, బోనాల పండుగల సందర్భంగా శాంతిభద్రతలపై చర్చించారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాదుల చర్యలకు చరమగీతం పాడాలన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు హైదరబాద్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల నగరంలో ఉగ్రవాదులు పన్నిన పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ అధికారులను, పోలీసులను ఆయన అభినందించారు. సకాలంలో కేంద్ర దర్యాప్తు బృందంతో కలసి నగరంలో జరగబోయే పెద్ద ప్రమాదాన్ని నివారించడంలో పోలీసులు జరిపిన కృషి ప్రశంసనీయమన్నారు. ఇస్తాంబుల్, ఢాకాలో ఉగ్రవాదుల దాడి అమానుషమని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని, ఉగ్రవాదుల పట్ల సానుభూతి సరైంది కాదన్నారు. ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఒవైసీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ, న్యాయ సహాయానికి పూనుకోవడం మంచిది కాదన్నారు. కేంద్రమంత్రితో భేటీ అయిన అధికారుల్లో సైబరాబాద్ ఈస్ట్ జోన్ కమిషనర్ నవీన్ చంద్, వెస్ట్ జోన్ కమిషనర్ ఎంఎం భగవత్‌తో పాటు అదనపు డిజిపి అంజనీకుమార్ తదితరులు ఉన్నారు.

చిత్రం.. తెలంగాణ పోలీస్ అధికారులతో భేటీ అయన కేంద్ర మంత్రి దత్తాత్రేయ