రాష్ట్రీయం

‘మెట్రో’ వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: నిత్యం ట్రాఫిక్‌తో నరకయాతన అనుభవించే జంటనగరాల ప్రజలకు మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే! ఇప్పటి వరకు కారిడార్ 1లోని మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ వరకు, అలాగే కారిడార్ 3లో నాగోల్ నుంచి హబ్సిగూడ వరకు సుమారు ఇరవై కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్ సిద్ధంగా ఉందని, ప్రారంభోత్సవానికి సంబంధించి సర్కారు ముహూర్తం నిర్ణయించాల్సి ఉందని మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించినా, ఇదివరకు నిర్ణయించిన చార్జీలకే మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రారంభమైన సంవత్సరం నుంచి ప్రతి ఏటా అయిదు శాతం పెంచాలన్న నిబంధన ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు కారిడార్లలో కలిపి సుమారు 63 శాతం పనులు పూర్తి చేసుకున్న మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం గడువు 2017 జూలై కల్లా తీరుతుందన్నారు. మెట్రో స్టేషన్లు నిర్మితమవుతున్న మొత్తం 60 ప్రాంతాల్లో సుమారు 50 స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు, ఈ పార్కింగ్‌లకు జిహెచ్‌ఎంసి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రతి స్టేషన్‌లో సైకిళ్లు అందుబాటులో ఉంటాయని, ఇందుకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటి వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఏర్పాటు చేస్తున్న కారిడార్-1 పూర్తి స్థాయిలో, అలాగే నాగోల్ నుంచి శిల్పారామం వరకు నిర్మిస్తున్న కారిడార్-3లో ప్రాజెక్టు గడువు ముగిసేలోపు మూడో వంతు కారిడార్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.ఇక పాతబస్తీలో అలైన్‌మెంట్ విషయం సర్కారు పరిశీలనలో ఉందని ఆయన వివరించారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు స్థల సేకరణ, పనులకు సంబంధించి నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో స్టేషన్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబిల నిర్మాణం వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. కారిడార్ 1లో నిత్యం రద్దీగా ఉండే 12 జంక్షన్ల పనుల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ, కారిడార్ 2లోని నాలుగు జంక్షన్ల పనులు, కారిడార్ 3లోని 10 జంక్షన్లలో మూడు పూర్తయ్యాయని, మిగిలిన వి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
ఒక్కో ఫ్లాట్‌కు రూ. 50లక్షల పరిహారం
కారిడార్ 3లో భాగంగా సికిందరాబాద్‌లోని పద్మహంస అపార్ట్‌మెంట్‌తో పాటు మరో భవనానికి చెందిన స్థలాల్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. అయితే బ్లాక్-ఏలోని మొత్తం 24 ఫ్లాట్‌లు, కిందనున్న 11 షాప్‌ల స్థలాల్ని సేకరించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఫ్లాట్‌కు రూ. 50 లక్షల నుంచి 55లక్షల వరకు నష్టపరిహరాన్ని చెల్లించనున్నట్లు, ఇందుకు సంబంధించి కోర్టు నుంచి తుది తీర్పు రావల్సి ఉందని వివరించారు.
ఆర్టీసి బస్సు..మెట్రోరైలు వేళల అనుసంధానం
నగర ప్రజలకు మెట్రోరైలు అందుబాటులోకి రాగానే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి బస్సుల వేళలను మెట్రోరైలు వేళలతో అనుసంధానం చేయనున్నట్లు, ఇందుకు ఆర్టీసి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎండి వెల్లడించారు. ఫీడర్ బస్సుల నిర్వహణలోనూ ఆర్టీసికే తొలి ప్రాధాన్యతనిస్తామని, ఇందులో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడకుండా కాలుష్యం లేని విద్యుత్‌తో నడిచే ఎకో ఫ్రెండ్లీ వాహనాలను సమకూర్చనున్నట్లు ఎండి తెలిపారు.

తుది దశలో ఉన్న ఆలుగడ్డ బావి మెట్రో. నగరంలోని వివిధ జంక్షన్లలో దర్శనిమిస్తున్న మూడంచెల రవాణా వ్యవస్థ