ఆంధ్రప్రదేశ్‌

శ్రీనివాస్ విడుదలకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ విడుదలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ భార్య లలిత, పిల్లలను సోమవారం మంత్రి పల్లె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్ భార్య లలితతో మాట్లాడుతూ నైజీరియాలో ముఠాలు కిడ్నాప్‌లకు పాల్పడటం సహజమని, అయితే అక్కడి ప్రభుత్వం వారితో చర్చించి బందీలను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నైజీరియాలోని భారత్ హైకమిషన్‌తో మాట్లాడారని మంత్రి వివరించారు. నైజీరియా ఫెడరల్ ప్రభుత్వంతోను, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వంతోను చర్చించినట్టు వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విశాఖ ఎంపి కె హరిబాబు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. విజ్ఞాపనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలోని భారత హైకమిషన్ ప్రతినిధి బిఎన్ రెడ్డి ఇప్పటికే సిఎం చంద్రబాబు, తదితరులతో మాట్లాడారన్నారు. శ్రీనివాస్ కుటుంబీకులను కలిసిన సందర్భంగా మంత్రి రఘునాధరెడ్డి ఢిల్లీలోని ఎపి భవన్ ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను శ్రీకాంత్ ద్వారా శ్రీనివాస్ భార్య లలితకు వివరించారు. అధైర్య పడవద్దని, త్వరలోనే శ్రీనివాస్ సహా మరో ఇంజనీర్‌ను రక్షించి క్షేమంగా రప్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ పిల్లలు స్పూర్తి, సుమన్‌లకు ధైర్యం చెప్పారు.

శ్రీనివాస్ కుటుంబానికి ధైర్యం చెపుతున్న మంత్రి పల్లె రఘునాధరెడ్డి