ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌కు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్ధతి పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సింగపూర్ ప్రభుత్వం అధీనంలోని సింగపూర్ కన్సార్టియం సీడ్ క్యాపిటల్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్, అసెండాస్ కంపెనీలతోకూడిన కన్సార్టియంకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీడ్ క్యాపిటల్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే నిర్మించాలని గత ఏప్రిల్ 22న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు వివిధ దేశాల ప్రతిపాదనలను సమీక్షించేందుకు మంత్రుల స్థాయి కమిటీ (హెచ్‌పిసి)ని నియమించింది. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు ఎపిసిఆర్‌డిఎకు పూర్తి అధికారాలు ఇచ్చింది. సీడ్ క్యాపిటల్‌ను 6.84 చదరపుకిలోమీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం 5500 కోట్ల రూపాయిలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.