రాష్ట్రీయం

రేపే రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: నెలవంక దర్శనం (మంగళవారం) కాలేదు. దీంతో రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పండుగను ఈ నెల 7న (గురువారం) జరుపుకోవాలని ఢిల్లీ జామా మసీదు ఇమామ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 7, 8 తేదీలు సెలవు దినాలుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సెలవును 7వ తేదీకే మార్చింది. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలను ఇంతకు ముందు ప్రకటించినట్లుగా 6న కాకుండా, 7వ తేదీకి కేంద్రం మార్చిందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ సంఘం కార్యదర్శి ఎల్. సురేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు లభించాయి. పండుగ సెలవులు 7,8 తేదీలు కాగా, 9న రెండో శనివారం కావడం, 10న ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసి వచ్చాయి.