రాష్ట్రీయం

ఎట్టకేలకు ఫీజుల జీవో జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో 179 ఇంజనీరింగ్, 10 ఆర్కిటెక్చర్, రెండు ప్లానింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేశారు. దాంతో పాటు 73 ఫార్మసీ, 29 ఫార్మా డి కాలేజీల ఫీజులను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌లో గరిష్ట ఫీజు 1,13,500 రూపాయిలు సిబిఐటికి దక్కింది. కనిష్ట ఫీజు 35వేలుగా నిర్ణయించారు. ఆర్కిటెక్చర్ కాలేజీల్లో గరిష్ట ఫీజు 85వేల రూపాయిలు డక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌కు దక్కింది. అరోరా ప్లానింగ్ కాలేజీలకు 50 వేలు, 45వేలు ఫీజు నిర్ధారించారు. బి ఫార్మసీలో గరిష్టంగా 90వేల రూపాయిల ఫీజు సరోజనీనాయుడు వనితా ఫార్మసీ మహా విద్యాలయకు నిర్ధారించారు. ఫార్మా డి కోర్సులో సిఎంఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో రూ.1.15 లక్షలు నిర్ధారించారు.
90 వేలు ఫీజు దాటిన కాలేజీలు
ఇంజనీరింగ్ కోర్సు ఆఫర్ చేస్తున్న అనురాగ్ (సివిఎస్‌ఆర్) ఫీజు 93వేలు, బివిఆర్‌ఐలో 95వేలు, సిబిఐటిలో 1,13,500, సివిఆర్‌హెచ్‌లో 90వేలు, జి నారాయణమ్మలో 95వేలు, గోకరాజు రంగరాజులో 95వేలు, కిట్స్‌లో 1.05 లక్షలు, ఎంజిఐటిలో లక్ష, ఎంవిఎస్‌ఆర్‌లో 95వేలు, వరంగల్ ఎస్‌ఆర్‌హెచ్‌పిలో 95వేలు, శ్రీనిధిలో 91వేలు, వర్ధమాన్‌లో 1.05 లక్షలు, విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 98,500 రూపాయిలు, ముఫకంజా 85వేలు ఫీజును ఖరారు చేశారు. దీనికి తోడు ప్రతి విద్యార్ధి ఇంజనీరింగ్ కోర్సునకు వెయ్యి, కామన్ సర్వీసెస్‌కు 1500 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక 60వేలు దాటి ఫీజు నిర్ధారించిన కాలేజీల్లో ఎసిఇజి(68వేలు), అన్నమాచార్య(60వేలు), అరోరా ఎయుఆర్‌జి(62వేలు), అవంతి (60వేలు), భారత్(67వేలు), బ్రిలియంట్(65 వేలు), బ్రిలియంట్ రెండో కాలేజీ (60వేలు), బివిఆర్‌ఐటి(65వేలు), సిఎంఆర్‌కె(75వేలు), సిఎంఆర్‌ఎం(70వేలు), డివిఆర్‌సి (60వేలు), గీతాంజలి(81వేలు), గురునానక్(75వేలు), గురునానక్ టెక్నికల్ క్యాంపస్(78వేలు), హెచ్‌ఐటిఎం(65వేలు), ఐఎఆర్‌ఇ(67వేలు), జెపిఎన్‌ఇ(69వేలు), కెటికెఎం(70వేలు), కెఎంఐటి(77వేలు), కెజిఆర్‌హెచ్(65వేలు), కెఎల్‌ఆర్‌టి(60వేలు), కెపిఆర్‌టి(60వేలు), ఎంహెచ్‌విఆర్(60వేలు), మల్లారెడ్డి ఎంఎల్‌ఆర్‌డి (70వేలు), మల్లారెడ్డి ఎంఆర్‌ఇసి(78వేలు), ఎంఆర్‌సిడబ్ల్యు(60వేలు), ఎంఎల్‌ఆర్‌ఎస్ (65వేలు), మాతృశ్రీ ఇంజనీరింగ్ (67వేలు), మెథడిస్టు ఎంఇటిహెచ్(60వేలు), ఎంఎల్‌ఐడి (70వేలు), ఎన్‌ఆర్‌ఇసి(73వేలు), ఎన్‌ఎన్‌ఆర్‌జి (65వేలు), ఎస్‌డిఇఎస్(62వేలు), ఎస్‌ఆర్‌వైఎస్(62వేలు), ఇందు(76వేలు), ఎంఆర్‌టిఎన్(60వేలు), ఎస్‌పిఇసి(65వేలు), ఎస్‌విఐటి(69వేలు), విఎజిఇ(75వేలు), వాసవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (86వేలు), విద్యాజ్యోతి (80వేలు), విజ్ఞాన్ విజిఎన్‌టి(80వేలు), విజ్ఞాన భారతి విబిఐటి(67వేలు) ఉన్నాయి.
మిగిలిన కాలేజీల ఫీజు 35వేల నుండి 60వేల మధ్య ఉంది.
మొత్తం మీద తెలంగాణలో యూనివర్శిటీ కాలేజీల్లో 3040 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 89,055 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 89,055 ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే బి ఫార్మసీకి సంబంధించి యూనివర్శిటీల్లో 180, ప్రైవేటు కాలేజీల్లో 3868 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 2888 సీట్లు భర్తీ చేయనున్నారు. ఏరోనాటికల్‌కు 240 సీట్లు, ఆటోమొబైల్‌కు 60, బయోమెడికల్‌కు 30, బయోటెక్నాలజీకి 60, కెమికల్‌కు 120 సీట్లు కేటాయించింది. సివిల్ ఇంజనీరింగ్‌కు 9999 సీట్లు, సిఎస్‌ఇకి 21930 సీట్లు, ఇసిఇకి 21798 సీట్లు, ట్రిపుల్‌ఇకి 10363 సీట్లు, ఎ లక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌కు 240 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 2340 సీట్లు, మెకానికల్ 12345 సీట్లు, మెకానికల్ మెకట్రానిక్స్ 60, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ 60, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 60 సీట్లు కలిపి మొత్తం 79,705 సీట్లు కేటాయించారు. అలాగే బి ఫార్మసీ బ్రాంచిలో 4వేల సీట్లును కేటాయించింది. మొత్తం మీద 241 ఇంజనీరింగ్, 89 ఫార్మసీ కాలేజీలు, 30 ఎంబిఎ కాలేజీలు అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోగా, 158 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించింది. 158 కాలేజీల్లో మొత్తం 671 బ్రాంచిలు అనుబంధ గుర్తింపు పొందాయి. అలాగే 46 ఫార్మసీ కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపు దక్కింది. మంగళవారం నుండి అభ్యర్థులకు ఎమ్సెట్ వెబ్ ఆప్షన్ల అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.