రాష్ట్రీయం

తుది దశలో ఉద్యోగుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5 : ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన తుదిదశకు చేరింది. కమలనాథన్ కమిటీ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి ఇరు రాష్ట్రాల నుండి అధికారులు హాజరయ్యారు. ఐదు శాఖలు మినహా మిగతా అన్ని శాఖల ఉద్యోగుల విభజన పూర్తయిందని సిఆర్ కమలనాథన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, సచివాలయంతో సహా మరో నాలుగు శాఖల్లో ఉద్యోగుల విభజన తుదిదశలో ఉందన్నారు.
కమలనాథన్ కమిటీ పరిశీలన తర్వాత ఉద్యోగుల విభజనపై తుది నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఆమోదం తర్వాత రెండు రాష్ట్రాలకు ఉద్యోగులను కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎపికి చెందిన సుమారు 260 మంది ఉద్యోగులు అభ్యంతరాలను తెలియచేశారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలుగా తమను హైదరాబాద్‌లో కొనసాగించాలని కొంత మంది, కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురై ఉన్నందువల్ల వారి బాగోగులు చూసేందుకు వీలుగా తమను హైదరాబాద్‌లో ఉంచాలని, మరికొన్ని ఇతర కారణాలను చూపిస్తూ వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు ఈ నెల 11 న కమలనాథన్ కమిటీ సమావేశమవుతోంది. ఈ నెల చివరిలోగా ఉద్యోగాల పంపకాలను పూర్తి చేయాలని నిర్ణయించారు.