రాష్ట్రీయం

ఏపీ.. కాపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: ర్యాంకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారాన్ని కాపీ కొట్టిందంటూ టి- సర్కార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఎక్కడొందో వివిధ అంశాలపై పరిశీలించి కేంద్రం ర్యాంకు లు ఇస్తుంది. గత ఏడాది కాలం నుంచి తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు శ్రమించి మంచి ర్యాంక్ కోసం వినూత్నమైన అప్లికేషన్ రూపొందించారు. ఈ అప్లికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందన్నది తెలంగాణ సర్కార్ ఫిర్యాదు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు ఇఓడిబి ర్యాంకింగ్ కోసం అడ్డదారులు తొక్కుతున్న విషయాన్ని పేర్కొని, దీనికి సంబంధించిన ఆధారాలు అందజేశారు. పరిశ్రమలకు అనుమతుల జారీలో పారదర్శకత పెంచేందుకు, రెడ్ టెపిజం తగ్గించేందుకు ఇఓడిబి ర్యాంకింగులు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ స్ఫూర్తితో తమ అంతర్గత విధానాలను, పద్దతులను సరళీకరిస్తున్న తమ లాంటి రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్న అక్రమ మార్గాలు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అన్నారు. క్షేత్ర స్థాయిలో నిజంగా మార్పులు చేసిన రాష్ట్రాలకు మాత్రమే తుది ర్యాంకుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేవలం కాపీ కొట్టిన వెబ్ సైట్లలోని సమాచారంతో ఇఓబిడి స్ఫూర్తిని దెబ్బతీస్తున్న రాష్ట్రాలను గమనించాలని కోరారు.