రాష్ట్రీయం

ముంచే ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 5: ప్రజల జీవితాలకు నష్టం కలుగకుండా సాగునీరు అందిస్తామంటే ఎవరూ వద్దనరని, ఊళ్లను ముంచే ప్రాజెక్టు నిర్మించాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తామని టిజెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మంగళవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన- ఒక చర్చ సదస్సును మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఎవరికీ నష్టంలేకుండా ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందించే అవకాశం ఉన్నా ఆ పరంగా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. డిపిఆర్ కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోగా ఇంకా డిపిఆర్ తయారు కాలేదని సమాచారం ఇచ్చారన్నారు. డిజైన్ కాకుంటే బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేర్ ఇంకా పూర్తికాలేదని, పూరె్తైతేనే మల్లన్నసాగర్‌కు నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అందరినీ సంప్రదించి తక్కువ ముంపుతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ఒకవేళ తప్పని స్థితిలో భూములుకోల్పోతే వారికి 2013 ప్రకారం న్యాయం చేయాలన్నారు. భూసేకరణ చట్ట ప్రకారం నోటీసు వేసి విచారించాకే సేకరణ చేపట్టాలన్నారు. చట్టం ముందు అందరు సమానమేనని, చట్టప్రకారం నడుచుకుందామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒత్తిళ్లకు లొంగి ఆందోళనకు గురై నిర్వాసితులను నమ్మించి సంతకాలు పెట్టమంటే పెట్టొద్దన్నారు. భూసేకరణ విషయంలో నిర్వాసితులకు న్యాయం జరిగే దాకా ఆందోళనలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో కోఆర్డీనేటర్ రవీందర్, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం నేత లక్ష్మినారాయణ, రైతు స్వరాజ్యవేదిక నేత రవి, హైకోర్టు అడ్వకేట్ రఘు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వేములఘాట్ సదస్సులో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం