రాష్ట్రీయం

తేలని లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: కృష్ణానదీ జలాల పంపిణీపై సచివాలయంలో మంగళవారం జరిగిన కీలక సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడింది. జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ కార్యదర్శులు సమావేశమై నిర్ణయంచుకోవాలని కేంద్ర జల వనరులశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన చట్టబద్ధత ఉండదని, కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నిపుణుల కమిటీ వచ్చినప్పుడు ఎవరి వాదనలు వారు వినిపించడం ఉత్తమమనే అభిప్రాయాన్ని ఆంధ్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ఎస్‌కె జోషి వ్యక్తం చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ, నీటి పంపకాల కోసం ఏర్పాటు చేయనున్న వర్కింగ్ అరేంజ్‌మెంట్ కమిటీ, కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ముందు చర్చించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. అయితే ఇరు రాష్ట్రాల వాదనల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మూడు నాలుగు రోజులలో మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. కేంద్రం ఏర్పాటు చేయనున్న నిపుణుల కమిటీని ఇంకా నియమించలేదని, దానిని ఏర్పాటు చేసిన తర్వాత వాదనలు వినిపించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి అన్నారు. తమ వాదనలను కూడా నిపుణుల కమిటీ ముందు ఉంచుతామని ఇరు రాష్ట్రాల కార్యదర్శులు వెల్లడించారు. ఇలా ఉండగా ఖరీఫ్ సీజన్‌కు విడుదల చేయాల్సిన నీటి పంపకాలపై ఈ దశలో నిర్ణయం తీసుకోవడం కూడా వృధా ప్రయాసేనని వారన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజి 122 టిఎంసిలు, శ్రీశైలంలో 15 టిఎంసిలు మాత్రమే ఉండటంతో ఈ దశలో నీటి పంపకాలపై ఏం నిర్ణయం తీసుకోగలమని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

చిత్రం.. కృష్ణా జలాల పంపిణీపై చర్చించేందుకు సమావేశమైన
తెలంగాణ, ఆంధ్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు