రాష్ట్రీయం

బిజెపి లాయర్ల చలో రాజ్‌భవన్ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: బిజెపికి అనుబంధంగా ఉన్న లాయర్లు మంగళవారం నిర్వహించాలనుకున్న ‘్ఛలో రాజ్‌భవన్’ ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి లీగల్ సెల్ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు జిల్లాల నుంచి కూడా అనేక మంది న్యాయవాదులు తరలి వచ్చారు. ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్ధేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభృతులు ప్రసంగించారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు నేతృత్వంలో న్యాయవాదులు ‘్ఛలో రాజ్‌భవన్’ చేపట్టారు. దీంతో పోలీసులు వారిని ఇందిరా పార్కు సర్కిల్ రామకృష్ణా మఠం వద్దే నిలువరించారు. ఛలో రాజ్‌భవన్‌కు అనుమతించేది లేదని, ప్రతినిధుల బృందంగా ఐదుగురిని వెళ్ళేందుకు అనుమతిస్తామని పోలీసులు చెప్పినా వారు వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. ఈ దశలో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య కొంత సేపు తోపులాట, వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు సుమారు 50 మందిని అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు.
కేంద్రాన్ని శంకించవద్దు: డాక్టర్ లక్ష్మణ్
అంతకు ముందు డాక్టర్ లక్ష్మణ్ ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి పరిష్కరిస్తుందని, కేంద్రాన్ని శంకించవద్దని అన్నారు. గవర్నర్ పెద్దన్న పాత్ర పోషించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలని, న్యాయాధికారుల సస్పెన్షన్‌ను రద్దు చేయించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లోగడ తాను నిర్వహించబోయే యాగానికి ఎపి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆహ్వానించేందుకు వెళ్ళినప్పుడు రాష్ట్ర హైకోర్టు విభజన, అమరావతి వద్ద స్థలం కేటాయింపు అంశంపై ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం వేయడం భావ్యం కాదని అన్నారు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిథిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ చాలా స్పష్టంగా చెప్పారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు.
క్యాంపు ఆఫీసు ఎదుట ధర్నా: చింతల
రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ జంతర్-మంతర్ వద్ద ధర్నా చేస్తానని ప్రకటించి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ ముఖ్యమంత్రి జంతర్-మంతర్ వద్ద ధర్నా చేస్తే, కేంద్రానికి సంబంధం లేదని తాము సిఎం క్యాంపు ఆఫీసు ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, బిజెపి లీగల్ సెల్ నాయకులు ప్రసంగించారు.

చిత్రం.. చలో రాజ్‌భవన్‌కు తరలివస్తున్న బిజెపి లాయర్లను అడ్డుకుంటున్న పోలీసులు