రాష్ట్రీయం

భారీ భవనాలు కట్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 7: రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ప్లాట్‌లు మంజూరు చేస్తోంది. ఈ ప్లాట్లన్నింటినీ సమీకరించి భారీ భవంతులు నిర్మించేందుకు వివిధ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) రైతులు, డవలపర్స్, బిల్డర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. కొంతమంది రైతులు కలిసి ఒకే చోట్ల ప్లాట్లు తీసుకుంటే, వాటిని బిల్డర్లు తీసుకుని అభివృద్ధి చేసి, అపార్ట్‌మెంట్లు, లేదా గేటెడ్ కమ్యూనిటీ భవనాలను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతంలో భూమి తేలిగా ఉన్నందువలన అక్కడ భారీ భవనాలను నిర్మించడం సాధారణమైన విషయం కాదు. అందువలన నిర్మాణ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, బహుళ అంతస్తు భవనాలను నిర్మిస్తుంది. ఈ సందర్భంగా సిఆర్‌డిఏ ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ రాజధాని నరగరంలో నిర్మాణ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, రైతుల సహకారంతో భవన నిర్మాణదారులు వాటిని సద్వినయోగం చేసుకోవాలని సూచించారు. తొలిదశలో నేలపాడు రైతులకు ప్లాట్ కేటాయించామని అన్నారు. మిగిలిన గ్రామాల్లో ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ మొదటి వారం లోగా పాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. బిల్డర్లంతా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) 500 కోట్ల పెట్టుబడితో భవన నిర్మాణాలు చేపట్టడానికి తగిన ప్రతిపాదనలను శ్రీ్ధర్‌కు అందచేశారు. అలాగే కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), అప్రెడా ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బిల్డర్లు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

చిత్రం.. రైతులు, బిల్డర్లతో సమావేశమైన సిఆర్‌డిఎ అధికారులు