రాష్ట్రీయం

ఒకేసారి తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. కృష్ణా జలాల వివాదం, హైకోర్టు విభజన, 9,10 షెడ్యూల్‌లో ఆస్తుల పంపకం, విద్యుత్ ఉద్యోగుల తొలగింపువంటి అనేక అంశాలపై ఎపి, టిఎస్ ప్రభుత్వాలు నిత్యం గొడవపడుతున్న సంగతి తెలిసిందే. వీటిన్నింటికి పరిష్కార మార్గాన్ని చూపేందుకు గవర్నర్ నరసింహన్ స్వయంగా విజయవాడకు వచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏ ఒక్క అంశాన్ని పరిష్కరిద్దామన్నా, తెలంగాణ ప్రభుత్వం దాన్ని వేరే అంశంతో ముడి పెడుతోందని, దీనివలన సమస్యలు మరింత జటిలమవుతున్నాయని చంద్రబాబు గవర్నర్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల ముందున్న సమస్యలను ఒక్కొటొక్కటిగా కాకుండా, అన్నీ ఒకేసారి పరిష్కరించాల్సిందిగా గట్టిగా కోరారు. సమస్యలన్నీ పరిష్కారమైతే, ఎవరి పని వారు చేసుకుంటామని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యలను కొలిక్కి తీసుకువస్తానని గవర్నర్ సిఎం చంద్రబాబుకు చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
సచివాలయం బాగుంది!
గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం మంగళగిరి పానకాల స్వామిని, ఆ తరువాత విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. అక్కడి నుంచి వెలగపూడికి వెళ్లి తాత్కాలిక సచివాలయ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను తెలంగాణకే గవర్నర్‌గా వ్యవహరిస్తున్నాన్న ఆరోపణల్లో నిజం లేదని, ఎపిలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.తాత్కాలిక సచివాలయ భవనం నిర్మాణం చాలా బాగుందని అన్నారు. ఇందులో తనకూ ఒ చాంబర్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరానన్నారు. హైకోర్టు వివాదాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారని విలేఖరులు గవర్నర్‌ను కోరినప్పుడు నో కామెంట్ అని అన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తాయని గవర్నర్ తెలిపారు.వచ్చే పది పదేళ్లలో రెండు రాష్ట్రాలు అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తాయన్నారు. రాజధాని నిర్మాణంలో సమస్యలు తప్పవని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
గవర్నర్ సలహాలు పాటిస్తాం
గవర్నర్ ఇచ్చిన సూచనలను, సలహాలను పాటించి ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణ పనులపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఇక్కడి నుంచే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

చిత్రం.. తాత్కాలిక సచివాలయాన్ని చంద్రబాబుతో కలిసి పరిశీలిస్తున్న గవర్నర్ నరసింహన్