రాష్ట్రీయం

కృష్ణా జలాలపై నేటినుంచి వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: కృష్ణా జలాల వివాదాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజుల వాదనల తరువాత తిరిగి ఈనెల 14, 15 తేదీల్లో తదుపరి వాదనలు జరుగుతాయి. రెండు దశలుగా నాలుగు రోజుల పాటు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్ర తమ వాదనలు వినిపిస్తాయి. న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్‌లో తెలంగాణ తన వాదన వినిపిస్తూనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నీటి పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్‌కు వివరిస్తామని అధికారులు తెలిపారు. నీటి లభ్యత ఆధారంగా మొదటి నుంచి కేటాయింపులు ఉండాలని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపు చేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందని తెలంగాణ స్పష్టం చేస్తోంది. అయితే ప్రాజెక్టు వారిగా కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తోంది. మొత్తం నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలన్నింటికీ కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాలని చెబుతోంది. 2013లోనే నివేదిక ఇచ్చినప్పటికీ బ్రజేష్ నివేదికను కేంద్రం నోటిఫై చేయని కారణంగా అమలులోకి రాలేదు. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం సెక్షన్ 89 ప్రకారం ట్రిబ్యునల్ గడువు పొడిగించారు. ట్రిబ్యునల్ ముందు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వాదనలు వినిపించాయి. ట్రిబ్యునల్ పరిధి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమా? లేక కృష్ణా పరీవాహక ప్రాంతం 4 రాష్ట్రాలకు వర్తిస్తుందా? అనే అంశంపై కేంద్రం, నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల వాదన ట్రిబ్యునల్ వింటుంది.