రాష్ట్రీయం

ఎమ్సెట్-2కు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పరీక్షకు 56,188 మంది దరఖాస్తు చేశారు. ఏపిలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9న ఉదయం 10 నుండి ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుంది. అదే రోజు సాయంత్రం తొలి కీ విడుదల చేస్తారు. దానిపై విద్యార్థుల నుండి 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం తుది కీ రూపొందించి, 14న ఫలితాలను ప్రకటిస్తారు.
మరో ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి
జెఎన్‌టియు మరో ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. అందులో కెఎస్‌ఆర్‌ఆర్, జోగినపల్లి బిఆర్, మల్లారెడ్డి, మల్లారెడ్డి ఉమెన్, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ, గాంధీ అకాడమి, శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు దక్కింది. నాలుగు ఫార్మసీ కాలేజీలకూ గుర్తింపు ఇచ్చింది అందులో శ్రీ బాలాజీ కాలేజీ, బ్రిలియంట్, ధన్వంతరి, ట్రినిటీ కాలేజీలున్నాయి.