రాష్ట్రీయం

నిలోఫర్‌లోనూ అదే బ్యాక్టీరియా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: గర్భిణులు..నవజాత శిశువులకు వైద్యం అందించటంలో జాతీయ స్థాయిలోనే పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో రోగులకు వైద్యం వికటించిన వార్త దావానలంలా వ్యాపించడంతో స్పందించిన డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు, గర్భిణులకు ఇస్తున్న జంక్షన్లు, సెలైన్‌లను తనిఖీ చేశారు. ఈ రెండు ఆసుపత్రులకు కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఎంఐడిసి) నుంచే వైద్య సంబంధిత పరికరాలు, కొన్ని రకాల మందులు సరఫరా అవుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ఆసుపత్రులకు సరఫరా చేసిన సెలైన్ బాటిళ్లు, పలు ఇంజక్షన్లు ఒకే బ్యాచ్‌కు చెందినవి కావటంతో అధికారులు ముందు జాగ్రత్తగా నిలోఫర్‌లో తనిఖీలు నిర్వహించారు. పలు సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఆనవాళ్లు కన్పించటంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆసుపత్రి నుంచి 29వేల సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది.
మేమే తనిఖీ చేయించాం:
సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్
నిలోఫర్ ఆసుపత్రిలో గురువారం డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందన్న విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్‌ను సంప్రదించగా, అలాంటిదేమీ లేదన్నారు. రెండురోజుల క్రితం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆ ఆసుపత్రికి, తమ ఆసుపత్రికి సరఫరా చేసిన ఇంజక్షన్లు, సెలైన్లలో కొన్ని ఒకే బ్యాచ్‌కు చెందినవి, మరికొన్ని తర్వాత బ్యాచ్‌కు చెందినవి ఉండటంతో, ముందు జాగ్రత్తగా తామే డ్రగ్ కంట్రోల్ అధికారులతో చెక్ చేయించినట్లు డాక్టర్ సురేశ్‌కుమార్ తెలిపారు.