రాష్ట్రీయం

బాబు నియంత.. మోదీ అబద్ధాలకోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 7: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలయమయ్యాయని, చంద్రబాబు నాయుడు నియంతగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీ అబద్ధాలకోరని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికార యంత్రాంగం కాకుండా టిడిపి కార్యకర్తలు అమలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రధాని, వాటినే ఇప్పుడు తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాకే ఆఖరున ఆ ఫైల్‌పై కాంగ్రెస్ సంతకం చేసిందని గుర్తు చేశారు. విశాఖలో జరిగిన ఎన్నికల సభలో విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటించిన మోదీ ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. జిఎస్‌టి తమ ప్రభుత్వం ప్రతిపాదించగా, గుజరాత్ సిఎంగా దానిని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని తామే ప్రతిపాదించామని చెపుతున్నారని, జిఎస్‌టికి తాము వ్యతిరేకం కాదని, కానీ మూడు సవరణలను ప్రతిపాదిస్తున్నామని వివరించారు. ఏపీ సియం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉండగా, కార్యకర్తలు పథకాల అమలుపై పెత్తనం చెలాయిస్తున్నారు. కాపు రిజర్వేషన్‌ను అమలు చేయకుండా, ఆందోళన చేస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందంటూ ఆరోపించిన చంద్రబాబు విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు తాజాగా రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఎంతమొత్తం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లాం మతబోధకుడు జాకీర్ నాయక్‌తో దిగ్విజయ్ సింగ్ ఫొటోలు దిగడంపై స్పందిస్తూ తాను 2012లో ముంబయిలో జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లానని, అక్కడ అతనిని కలిశానని వివరించారు. తాను అక్కడ మత చాందస భావాలకు వ్యతిరేకంగా, మత సామరస్యాన్ని కోరుతూ మాట్లాడానని గుర్తు చేశారు. నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.