రాష్ట్రీయం

విభజించాల్సిన ఫైళ్లు 12లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సెంట్రల్ రికార్డ్సు బ్యూరోలో ఫైళ్ల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12 లక్షల ఫైళ్లు ఉన్నాయి. ప్రతి ఫైలును రెండుగా స్కానింగ్ చేసి రెండు రాష్ట్రాలకు ఒక్కో ప్రతిని ఇస్తారు. సచివాలయంలో రెండు స్టోర్ రూంలలో ఏళ్లతరబడి లక్షలాది ఫైళ్లు ఉన్నాయి. వీటి విభజన ఇంకా జరగలేదు. ఒకటి రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ ఫైళ్ల విభజన, స్కానింగ్‌కు ఉద్యోగులను కేటాయించనున్నారు. 12 లక్షల ఫైళ్లలో దాదాపు 7 లక్షల ఫైళ్లు ఆంధ్రాకు, 5 లక్షల ఫైళ్లు తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో చాలా ఫైళ్లు ఉమ్మడిగా ఉన్నాయి. ఇందులో కామన్ ఫైళ్లను జాగ్రత్తపరచాల్సి ఉంది. కీలకమైన ఫైళ్ల భద్రతకు కూడా చర్యలు తీసుకోనున్నారు. 147 విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. మరో ఆరు శాఖల్లో ఉద్యోగుల విభజన వచ్చే పక్షం రోజులు పూర్తి కానుంది. వైద్య విద్య, ఆరోగ్య శాఖ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఎస్‌పిఎఫ్, ఆయూష్, డిజిపి ఎస్టాబ్లిష్‌మెంట్ శాఖల్లో మాత్రమే ఉద్యోగుల పంపకం మిగిలి ఉంది. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, న్యాయ శాఖ, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పంపకానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్ల కేటాయింపుపై కోర్టు స్టేలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల విభజన ప్రక్రియ మిగతా విభజన అయిన రాష్ట్రాల కంటే సులభతరంగా మారిందని, 57 వేల మంది ఉద్యోగుల మొబైల్ నంబర్లు సేకరించడం, వారి ఆఫ్షన్లను తీసుకునేందుకు లాగిన్, యూజర్ ఐడిని తీసుకున్నామని ఐఎఎస్ అధికారి ప్రేంచంద్రారెడ్డి చెప్పారు. వివిధ శాఖల అధిపతుల నుంచి వారి అభిప్రాయాలను ఆన్‌లైన్‌ద్వారా స్వీకరించడం వల్ల అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల కేటాయింపు సాఫీగా జరుగుతోందన్నారు.