రాష్ట్రీయం

ఒక్కరికే కలరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: ఫీవర్ ఆస్పత్రిలో ఒకరికి కలరా సోకినట్టు నిర్థారణ అయ్యందని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో కలరా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు తెలియడంతో మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిని శనివారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. కలరా, ఇతర విష జ్వరాలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. కేవలం ఒక్కరికి మాత్రమే కలరా సోకినట్టు వైద్య రికార్డుల్లో నమోదైందని, సరైన సమయంలో చేరడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కలరాపై హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని వైద్యశాలలు, వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వ వైద్య శాఖ అప్రమత్తం చేసిందన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో కలరా చికిత్సకు అవకాశం ఉందన్నారు.
సరోజినీ కంటి ఆస్పత్రి ఘటనపై విచారణ జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు. నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు ఎవరినీ బాధ్యులను చేయలేదన్నారు. తమ తప్పేమీ లేకుండా తమను బాధ్యులను చేస్తున్నారంటూ డాక్టర్లు చేసిన ప్రకటనపై మంత్రి స్పందిస్తూ ఇప్పటివరకు ఎవరినీ బాధ్యులను చేయలేదన్నారు.
స్టేట్ హోంకు వీణావాణిలు
వీణావాణిలను స్టేట్ హోంలో పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. డాక్టర్లు ఎలా నిర్ణయిస్తే, దానిని అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి వెంట వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఇతర అధికారులు ఉన్నారు.

చిత్రం.. నిలోఫర్‌లో రోగులను పరామర్శిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి