రాష్ట్రీయం

వందమందికి నిమిషం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ఎమ్సెట్-2కు ఒక్క నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం ఆలస్యంగా వచ్చిన దాదాపు వందమంది విద్యార్ధులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. కొద్ది సెకెన్లు ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను సైతం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 10 గంటలకు ప్రధాన ద్వారాలకు గొలుసులు కట్టి తాళాలు వేయడం మరీ ఘోరమని లబోదిబోమన్నారు. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ ప్రధాన ద్వారానికి 10 గంటలకు తాళాలు వేయడంతో గేట్ల మధ్యన ఉన్న ఖాళీలోంచి లోపలికి దూరి పరీక్ష హాలుకు చేరుకోవడానికి కొందరు అమ్మాయిలు పడిన అవస్థ బస్టాప్‌లో ఉన్న అందరికీ ఆవేదన కలిగించింది. ఒకమ్మాయి ఆ చిన్న ఖాళీలో దూరినా, ఆ కొద్దిపాటి ఖాళీలోంచి తల దూరడం కష్టమైంది. గేటు లోపల శరీరం, గేటు బయట తల...ఆ అమ్మాయి పడిన నరకయాతనను అక్కడే పోలీసులు, సిబ్బందీ చూస్తూ కూర్చున్నారేగానీ, రక్షించిన పాపానపోలేదు. అదే పరిస్థితి జెఎన్‌టియు కూకట్‌పల్లిలోనూ, ఉస్మానియాలోనూ కనిపించింది. విశాలమైన ప్రాంగణాలున్న కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏ బ్లాక్‌లో నిర్వహిస్తున్నారో అర్ధంకాక కూడా విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు. ప్రతి ఏటా ఎమ్సెట్‌కు 95 నుండి 98 శాతం మంది హాజరవుతుండగా, ఈసారి ఎమ్సెట్-2కు హాజరుశాతం మునుపెన్నడూ లేని విధంగా 90.76 శాతానికి పడిపోయింది. అంటే పరీక్షకు దాదాపు ఆరువేల మంది గైర్హాజరయ్యారు.
ఆర్ కోడ్
పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం డ్రా కార్యక్రమం జెఎన్‌టియులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి డ్రా తీశారు. అందులో ఆర్ కోడ్ ఉన్న ప్రశ్నాపత్రాన్ని ఆయన ఎంపిక చేశారు.