రాష్ట్రీయం

పొలాల్లో గడ్డి తొలగించే సైకిల్ వీడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, జూలై 9: పొలాల్లో గడ్డి తీసేందుకు అన్నదాతలు ఇకపై ప్రయాస పడనక్కర్లేదు. తక్కువ ఖర్చుతో, సొంతంగా తామే ఆ పని చేసుకోగలిగేలా రూపొందించిన ‘సైకిల్ వీడర్’ ఇప్పుడు అందుబాట్లోకి వచ్చింది. దీని సాయంతో ఒక రైతు రోజుకు ఒకటిన్నర ఎకరా పొలంలోని గడ్డి తొలగించవచ్చు. అనంతపురం జిల్లా నల్లమాడలోని రైతుసేవా కేంద్రం రూపొందించిన ఈ సైకిల్ వీడర్ రైతన్న కష్టాలు తీర్చే పరికరమని చెప్పవచ్చు. సైకిల్ టైరు తిరిగేలా ఇరువైపుల ఇనుప కడ్డీలు అమర్చి గడ్డి పీకేందుకు వీలుగా కిందిభాగంలో పదునైన బ్లేడు అమర్చారు. దీని సాయంతో రైతు ఒక్కరే పొలంలోని గడ్డిని శ్రమ లేకుండా తొలగించవచ్చు. దీంతో సమయం, డబ్బు ఆదా. జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, టమోటా సాగుచేసిన పొలాల్లో ఈ యంత్రం సాయంతో గడ్డి తొలగించవచ్చు. ఈ యంత్రం తయారీకి అయ్యే ఖర్చు రూ. 5 వేలు లోపే. దీన్ని రైతులే స్వయంగా తయారుచేసుకోవచ్చు.