రాష్ట్రీయం

‘సీటు గ్యారెంటీ’పై శ్రీచైతన్యకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: ‘మెడికల్ సీటు గ్యారెంటీ...లేకపోతే ఫీజు వాపస్’ అంటూ శ్రీచైతన్య విద్యాసంస్థలు జారీ చేసిన ప్రకటనలపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ‘ష్యూర్ నీట్’ అంటూ శ్రీచైతన్య జారీ చేసిన ప్రకటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సైతం ఈ నోటీసులను ఒకటి రెండు రోజుల్లో పంపనున్నట్టు తెలిసింది. తమ వద్ద కోచింగ్ తీసుకుంటే ప్రతి ఒక్కరికీ మెడికల్ సీటు వస్తుందనీ, ఒక వేళ అలా సీటు రాకుంటే 60 శాతం ఫీజు వాపస్ చేస్తామని శ్రీచైతన్య యాజమాన్యం వివిధ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు విద్యార్ధులను, తల్లిదండ్రులను మభ్యపెట్టడమేనని పేర్కొంటూ ఎపి చట్టం 25/1997 సెక్షన్ 7, 7ఎ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని నోటీసులు ఇచ్చారు.