రాష్ట్రీయం

‘మహా’ ఒప్పందం మూడో వారానికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: గోదావరిపై కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఈనెల 14న కుదరాల్సిన ఒప్పందం వాయిదా పడింది. జూలై మూడవ వారంలో ఈ ఒప్పందం కుదురుతుందని అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంతో పాటు ఒప్పందాల కోసం జూలై 14న ముంబైలో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావాలని తొలుత నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని మహారాష్ట్ర సూచించింది. దాంతో మూడవ వారంలో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం తేదీని ఖరారు చేయలేదు.