రాష్ట్రీయం

జిహాద్ అంటే చావడం కాదు.. బతకడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: ‘జిహాద్ అంటే ఇస్లాం కోసం చావడం కాదు, ఇస్లాం కోసమే బతకడం’ అని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అసద్ ప్రసంగిస్తూ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. వాళ్ళు నరకలోకపు కుక్కలు, ఇస్లాం పేరిట అమాయకుల రక్తం తాగుతున్నారంటూ మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్త మసీదునే ధ్వంసం చేయాలనుకున్న విద్రోహులు అని విమర్శించారు. ఏదో ఒక రోజు ముస్లిం నీ దగ్గరికి వచ్చి, నీ శరీరాన్ని వంద ముక్కలుగా నరుకుతాడు అంటూ ఆయన ఐసిస్ చీఫ్ అబూ బకర్ బాగ్దాదీని హెచ్చరించారు. పశ్చిమ దేశాల చేతుల్లో ఆయుధాలుగా మారి ఇస్లాం మూలాలను ధ్వంసం చేయాలనుకుంటున్న కుట్రదారులకు ఆయన సవాల్ విసిరారు. జిహాద్ చేయాలనుకుంటున్న వారు బస్తీల్లోకి వచ్చి, పేద ముస్లింల ఆకలి బాధ తీర్చండి, పిల్లలకు చదువులు చెప్పించండి, అడపిల్లల పెళ్ళిళ్లకు సాయం చేయండి అని ఆయన సవాల్ విసిరారు. ఐసిస్ చర్యల వల్ల ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం గొంతు వినిపించలేని పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. భారత్ గొప్ప దేశమని, క్లిష్ట సమయంలో ముస్లింలు ఐక్యంగా శాంతియుతంగా ఉండాలని అసద్ పిలుపునిచ్చారు. సూఫీ, షియా, దేవ్ బందీ, బరేల్వీ, ముస్లింలోని అన్ని వర్గాలు ఒక్కటై ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆయన సూచించారు.