రాష్ట్రీయం

బాలకిష్టారెడ్డికి లంక వర్శిటీ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శామీర్‌పేట, జూలై 9: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఎయిర్ అండ్ స్పేస్ లా లో నిష్ణాతుడైన ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డికి శ్రీలంక రాజధాని కొలంబోలోని జనరల్ సర్ జాన్ కోటేలవల డిఫెన్స్ యూనివర్శిటీ నుండి ఆహ్వానం అందింది. డిఫెన్స్ యూనివర్శిటీలో న్యాయ శాస్త్ర విద్యార్థులకు అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ స్పేస్ లా అంశాలపై బోధించేందుకు బాలకిష్టారెడ్డిని ఆహ్వానించారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయ కోవిదుడు క్రిస్ట్ఫోర్ పింటో ఆధ్వర్యంలో నడిచే మొరోగోడ ఫౌండేషన్ అనే ధర్మాదాయ సంస్థ ఆధ్వర్యంలో బాలకిష్టారెడ్డి లంక విద్యార్థులకు బోధన జరపనున్నారు. స్పేస్ లా ముసాయిదా రూపకల్పన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

చిత్రం.. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి