రాష్ట్రీయం

ప్రాజెక్టులకు ఇసుక రీచ్‌ల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: రాష్ట్రంలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరం అయిన ఇసుక రీచ్‌లను నీటిపారుదల శాఖ గుర్తిస్తోంది. రెండు రోజుల్లో రిసోర్స్ మ్యాపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ప్రాజెక్టులకు కోటి 72లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అని నిర్ధారించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరం అయిన ఇసుక రీచ్‌లను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ మైనింగ్ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు సచివాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లకు సంబంధించి రెండు రోజుల్లో మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ప్రాజెక్టులకు సమీపంలోని ఇసుక వనరులను గుర్తించాలని తెలిపారు. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారిగా ఇసుక అవసరాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ నుంచి కరీంనగర్ జిల్లా గౌరవల్లి, గండిపల్లి వరకు, వరంగల్ జిల్లా దేవాదుల , నల్లగొండ జిల్లా ఎఎంఆర్‌పి, పెండ్లి పాకల, ఉదయ సముద్రం, డిండి తదితర ప్రాజెక్టులకు మొత్తం ఒక కోటి 72లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని నిర్థారించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును కెటిఆర్ అభినందించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమర్థవంతమైన నాయకత్వంలో మైనింగ్ శాఖ ఆదాయం 45శాతం పెరిగినట్టు చెప్పారు. ఈ యేడాది రెట్టింపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కెటిఆర్ తెలిపారు.
మిడ్‌మానేరులో ఈ యేడాది మూడు టిఎంసిల నీటిని నిల్వ చేయాలని అనుకుంటున్నందున వీలైనంత త్వరగా ఇసుకను ప్రాజెక్టులకు తరలించాలని మంత్రులు ఆదేశించారు. కాళేశ్వరం ప్యాకేజీ 9, రంగనాయకి సాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్‌మానేరు నుంచి ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని నిర్ణయించారు. ఇసుక తరలింపులో అక్రమాలు నిరోధించాలని, అవక తవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు. అవసరమైతే ఇసుక రీచ్ నుంచి ప్రాజెక్టుకు ఇసుక రవాణా చేసే ట్రక్కులు, ఇతర వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని మైనింగ్ ఇరిగేషన్ అధికారులను కోరారు. రీ ఇంజనీరింగ్ కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్యాకేజీల వారిగా హరీశ్ సమీక్షించారు. ప్రధానంగా ప్రాజెక్టుల భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. పనితీరు సరిగా లేని కింది స్థాయి సిబ్బందిని , ఇంజనీర్లను మార్చి తమ బృందంలోకి ఎవరు కావాలో తీసుకోవచ్చునని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లకు మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

చిత్రం.. సచివాలయంలో శనివారం అధికారులతో సమీక్షిస్తున్న
తెలంగాణ మంత్రులు తారక రామారావు, హరీశ్‌రావు