రాష్ట్రీయం

వీణావాణిలను వేరు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్తచ్రికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా వైద్యుల బృందం ముందుకొచ్చిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. వారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి నగరంలోని నిలోఫర్, తదితర ఆసపత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీణావాణిలకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను త్వరలో ఆస్ట్రేలియా వైద్య బృందానికి పంపించనున్నట్టు చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వీణావాణీల విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. కవలల పోషణ, విద్యాభ్యాసానికి సంబంధించి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాతో చర్చించనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. అంతేగాక, వీరి పోషణ ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పించటంతోపాటు తన మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించనున్నట్లు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.