రాష్ట్రీయం

తెలంగాణలో ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం చేయడం ద్వారా తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం తెలంగాణ నాయకులతో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా తూడిచిపెట్టుకుపోయాయి. కాంగ్రెస్ అవసాన దశలో ఉంది. కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ నాయకులు టిఆర్‌ఎస్ పట్ల సానుభూతితో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ చాలామంది కాంగ్రెస్ నాయకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం అసమర్థతతోవిసిగిపోతున్న కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్ వైపు చూస్తూ ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపించటం లేదు.‘ఆ లోటును భర్తీ చేయడానికి బిజెపి ముందుకు రావాలి. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తూ ప్రజల తరపున పోరాడాలి. తద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి’అని అమిత్ షా తెలంగాణ బిజెపి నాయకులకు హితవుపలికారు. పథకాల అమలు, పాలనలోనూ కెసిఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అందుకే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరు చేయడానికి ఇదే సరైన సమయం అని నేతలకు సూచించారు. అమిత్‌షా ఆదేశం మేరకు టి బిజెపి నాయకులు త్వరలోనే ప్రజాసమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి రానున్నారని తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో తెలంగాణలో పర్యటించే సమయానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ సర్కార్‌ను ఎండగడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.