రాష్ట్రీయం

ఆస్తుల విభజనపై సుప్రీంకు ఏపి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: ఏపి, తెలంగాణ మధ్య ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, డిపాజిట్ల పంచాయతీ తెగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ పరిసరాల్లో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్ధల భవనాలు, బ్యాంకు డిపాజిట్లలో తమకు రావాల్సిన వాటాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది. ఆస్తుల పంపకాలపై వచ్చే నెల 6వ తేదీలోగా కేంద్రం చర్చలకు పిలిచి పరిష్కరించని పక్షంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వం న్యాయ శాఖను ఆదేశించింది. ఈ విషయమై ఆరితేరిన న్యాయకోవిదుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 21న ఢిల్లీలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, భవనాల విభజనపై రెండు రాష్ట్రప్రభుత్వాల అధికారులను కేంద్రం పిలిచింది. కాని చర్చలు విఫలమయ్యాయి. రెండు రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, తాము చెప్పే సలహాను పాటించే స్ధితిలోలేవని, అందుకే ఉభయ పక్షాలూ స్వయంగా చర్చలు జరిపి, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని కూడా కేంద్రం సలహా ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఆస్తుల విభజనపై ఏకాభిప్రాయం లేదని, ఏం చేయాలో అభిప్రాయం తెలియచేయాలని కేంద్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 9, 10 షెడ్యూళ్లలోని 142 ప్రభుత్వ రంగ సంస్ధల విభజన జరగాల్సి ఉంది. పిఎస్‌యులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వీటికి బ్యాంకుల్లో రూ.16 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ సంస్థలు ఉన్న భవనాల మార్కెట్ విలువ వేల కోట్లలో ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం భవనాలు, డిపాజిట్లలో తమకు న్యాయబద్ధమైన వాటా ఉందని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, వీటి యాజమాన్య హక్కులు తమకే దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. సుప్రీం కోర్టు కేంద్రాన్ని రెండు నెలల్లో పరిష్కరించాలని జూన్ 6న ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఆగస్టు 6తో రెండు నెలల గడువు ముగుస్తుంది. ఇక జాప్యం చేయకుండా సుప్రీంకోర్టు గుమ్మం తడుతామని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో నిర్మించిన పిఎస్‌యు భవనాలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో నిర్మించారు. విభజన తర్వాత ఆ భవనాల్లో వాటాను ఎలా వదులుకుంటామని ఏపి ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. బూర్గుల రామకృష్ణారావు భవన్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల భవనం, జాతీయ నిర్మాణ భవనం, కొత్త ఎమ్మెల్యే భవనాలు, మంత్రుల భవనాల నిర్మాణాల్లో ఆంధ్రప్రజల వాటా ఉంది. అందుకే ఏయే భవనాలు ఎప్పుడు కట్టారు, వాటి విలువ ఎంత అనే దానిపై ఏపి ప్రభుత్వం మదింపును ప్రారంభించింది.