రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న మహా గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 9: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉండే ఆలయాన్ని ముంబయిలో నిర్మిస్తామని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి జె ఇ ఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండలపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం జె ఇ ఓ శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాలను ఆయనకు బహూకరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న ముంబయి నగరంలో శ్రీవారి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ దిశగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయన్నారు. అనంతరం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో సినీ నటుడు మోహన్‌బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవిద్యానికేతన్‌లో డిగ్రీ పట్టాలు పొందిన వారికి సర్ట్ఫికెట్ల ప్రదానోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు.