రాష్ట్రీయం

దుబాయ్ పేరు చెప్పి మలేసియా విమానమెక్కించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 11: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఆరుగురు పులివెందుల వాసులు మలేసియాలో నరకం అనుభవిస్తున్నారు. దుబాయ్‌కి పంపుతామని చెప్పిన ఏజెంట్లు తీరా మలేసియా విమానం ఎక్కించారు. దీంతో వారు వెనక్కు రాలేక, మలేసియాలో నానా అగచాట్లు పడుతున్నారు. మలేషియాలో చిక్కుకున్న తమవారిని వెనక్కు రప్పించాలని బాధితుల కుటుంబ సభ్యులు ఏపి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని సోమవారం కలిసి వేడుకున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన పటాన్ చిన్నతోషి, కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన వి.రామయ్య గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నెలకు రూ.25 వేల జీతం వస్తుందని చెప్పి పులివెందులకు చెందిన షేక్ షేక్షావలి, నాదెండ్ల ఖాసీం, ఉదయగిరి రఫీ, షేక్ మస్తాన్‌వలి, షేక్ హుసేన్‌పీరా, కాకర్ల బాబాయ్యను నమ్మించారు. ఒక్కొక్కరు రూ. 80వేలు ఇస్తే వీసా, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బు వసూలు చేశారు. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పి తీరా దుబాయ్ బదులు మలేషియా విమానమెక్కించారు. మలేషియాలో దిగిన వీరు తాము ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లు తెలుసుకున్నారు. తిరిగి వచ్చే దారి లేక కుటుంబసభ్యులకు జరిగిన మోసం గురించి కబురు పెట్టారు. దీంతో వారి కుటుంబసభ్యులు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి బాధితుల్ని స్వస్థలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మవద్దని, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే పేదలు ఎన్‌ఆర్‌ఐ శాఖను సంప్రదించి గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచే వెళ్లాలన్నారు.