రాష్ట్రీయం

రాజ్యాంగ ధర్మాసనానికి శబరిమలై ‘ప్రవేశ’ అంశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11:చారిత్రక శబరిమలై ఆలయంలోకి 10-50 సంవత్సరాల లోపు మహిళలను అనుమతించకూడదన్న అంశాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచికి నివేదించే సంకేతాలు వెలువడుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని, వీరిని శబరిమలై ఆలయంలోకి అనుమతించక పోవడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే పక్షంలో ఇందుకు సంబంధించి సమగ్ర ఉత్తర్వును జారీ చేస్తామని బెంచి తెలిపింది. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని రాజ్యాంగ బెంచికి నివేదించాల్సిన అవసరం కనిపిస్తోందని పేర్కొంది. ప్రార్థనా స్థలాలు బహిరంగ ప్రదేశాలు కాబట్టి..వీటిలోకి ప్రవేశించే విషయంలో ఎవరిపైనా ఎలాంటి నిషేధం ఉండటానికి వీల్లేదని..అలాంటి ఆంక్షలు వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.