రాష్ట్రీయం

రూపేశ్ కస్టడీపై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: సింథియాను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త రూపేష్‌కుమార్ పోలీస్ కస్టడీపై మంగళవారం విచారణ జరుగనుంది. ఈనెల 3న రూపేష్ తన భార్య సింథియాను హత్య చేసి దహనం చేసేందుకు యత్నించి పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు రూపేష్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. కాగా రూపేష్ కస్టడీకి సంబంధించి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరి కుమార్తె చిన్నారి సానియా ఎవరి వద్ద ఉండాలనే దానిపై రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
సానియాను తనకు అప్పగించాలని ఆమె నానమ్మ లలితాదేవి పిటిషన్ దాఖలు చేశారు. అయితే సానియాను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని సిసిఎస్ పోలీసులకు ఆదేశాలు అందాయి. కోర్టు తీర్పు వెలువడే వరకు సానియా బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంటుంది. కాలిపోయిన సింథియా మృతదేహం నిర్ధారణ కోసం చిన్నారి సానియాకు డిఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగో రాయబారి బ్రిగెట్టి, సింథియా సోదరుడు రాజేంద్రనగర్ కోర్టుకు హాజరయ్యారు. సానియాను చూసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును కోరారు. దీంతో వారు సానియాను మంగళవారం కలుసుకోవచ్చని కోర్టు అనుమతిచ్చింది.