రాష్ట్రీయం

పుష్కరాల్లో అన్నప్రసాద వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 11: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. టిటిడి కల్యాణ మండపంలో అన్నప్రసాదాలు తయారుచేసి రోజుకు 24 వేల ఆహారపొట్లాలు భక్తులకు పంపిణీ చేయాలని అదేశించారు. విజయవాడలోని పిడబ్ల్యూడి మైదానాల్లో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయంతో పాటు అమరావతిలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయంతో పాటు అమరావతిలోని బుద్ధ విగ్రహం వద్ద, శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద భక్త్భివం పంచేలా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సంగీత, భక్తి, ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక మునిసిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందుబాటులో ఉంచాలని, మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్వీబీసీలోతిరుమల కార్యక్రమాల లైవ్ కవరేజ్‌తో పాటు కృష్ణా పుష్కరాల్లో ముఖ్యమైన కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని సంబంధిత అధికారులను ఇఓ ఆదేశించారు. నమూనా ఆలయానికి విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు తగినంత సిబ్బంది, శ్రీవారి సేవకులను, ఎన్‌సిసి క్యాడెట్లను, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు శ్రీవారి ప్యాకెట్ సైజ్ చిత్రాన్ని ఉచితంగా అందజేయాలన్నారు.