రాష్ట్రీయం

పశు సంపదపై ఏపీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంపదను పెంపొందించటం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసి, రైతుల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ముఖ్యంగా బ్రెజిల్ తరహాలో ఒంగోలు జాతి పశుసంపదను వృద్ధి చెందేలా చూడటం ద్వారా, రైతులకు ఆర్థిక ప్రయోజనం అందుతుందని వివరించారు. కృత్రిమ గర్భధారణకు ఉపకరించే పశువీర్యాన్ని నకరికల్లులోని బఫెలో బ్రీడింగ్ సెంటర్(బిబిసి)లో అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. అక్కడ ఏర్పాటుచేసే పిండ మార్పిడి పరిశోధనా కేంద్రం ఫలితంగా రైతులు లబ్ధి పొందుతారన్నారు. రైతులకు అధిక పాలదిగుబడి ఇచ్చే పశుగ్రాస విత్తనాలను, సబ్సిడీ ద్వారా ఇస్తామని వెల్లడించారు. సోమవారం ఆయన అసెంబ్లీలోని తన కార్యాలయంలో పశుసంవర్థక శాఖ మంత్రి పుల్లారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
తాను బ్రెజిల్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత, ఆ దేశంలో పశుసంపద ఏవిధంగా అభివృద్ధి చెందిందో ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందించామన్నారు. బ్రెజిల్‌లో ఒంగోలు జాతి పశువులతో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, అక్కడ వారికి అదే పెద్ద వ్యాపారమని గుర్తించామన్నారు. నష్టాల్లో ఉన్న వ్యవసాయరంగానికి అనుబంధ రంగాలను జోడిస్తే లాభాలు రావడంతోపాటు, పశు సంపద పెరుగుతుందని చెప్పారు. వీటి అభివృద్ధికి కేంద్రం 25 కోట్లు కేటాయించిందని, నకరికల్లులోని 550ఎకరాల్లో ఉన్న సంస్థను తిరిగి పునరుద్ధరిస్తున్నామన్నారు. పబ్లిక్‌ప్రైవేటు పార్టనర్‌షిప్ పద్ధతిలో కృత్రిమ పద్ధతులు, మేలైన అండాలు, కృత్రిమ వీర్యం, పశుగ్రాస అభివృద్ధి చేస్తారని, దీనికోసం ఒక కోర్ కమిటీని నియమిస్తామన్నారు. ఆ కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత పని మొదలుపెడతామన్నారు. పిపిపి పద్ధతి వల్ల పిండాలు, పశుగ్రాసం ఎక్కువగా అందుబాటులోకి వస్తుందని, పైగా వారే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం వల్ల, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా కోడెల చెప్పారు. కాగా ఐదేళ్లు పిపిపి పద్ధతిలో ప్రైవేటుసంస్థలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
ఒంగోలు జాతి అభివృద్ధికి బ్రెజిల్ సహకారం
కాగా, బుల్‌షోలో పాల్గొనేందుకు వచ్చిన బ్రెజిల్ వ్యవసాయశాఖ మంత్రి, ప్రతినిధి బృందానికి స్పీకర్ కోడెల విందు ఇచ్చారు. భారత్‌లో మెరుగైన పశుసంతతి ఉందని, రెండు దేశాలు కలసి పనిచేస్తే పాడి పరిశ్రమపరంగా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఒంగోలు జాతి సహా బ్రెజిల్‌లో రూపాంతరం చెందిన జేబు సంతతి ఎద్దు వీర్యాన్ని భారత్‌కు అందించడం ద్వారా, పరస్పర సహకారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఒంగోలు జాతిని పటిష్టమైన జాతిగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ స్థాయి సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోడెల వారికి వివరించారు.