రాష్ట్రీయం

తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆర్టీసీ 1,486 బస్సులు కొనుగోలు చేసేందుకు టెండర్లు ఆహ్వానించామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 95 ఏసి బస్సులు, 386 సూపర్ లగ్జరీ, 405 పల్లెవెలుగు, 600 ఎక్స్‌ప్రెస్ బస్సుల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 18వ, తేదీ తుది గడువని, కొత్త ఏసి బస్సులను అధిక ఆదాయాన్నిచ్చే దూరప్రాంతాలకు నడపాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆర్టీసి ఎండి రమణరావు తెరిపారు. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 150 కోట్లు ఇచ్చిందని, ఇందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.