రాష్ట్రీయం

అమరావతి పిటిషన్‌పై విచారణ 20కి వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా పడింది. సోమవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ శ్రీమన్నారాయణ తరఫున న్యాయవాది గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. ఎపి ప్రభుత్వం నివేదికలో కేవలం కృష్ణా నదీ పరివాహకంలో కరకట్టలు గురించి మాత్రమే పేర్కొన్నారని చెప్పారు. నూతన రాజధాని ప్రాంతంలో వరద ప్రాంతలను గుర్తించలేదని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. అయితే మొదట ధర్మాసనం ఆగస్టు 22 తేదీకివాయిదా వేసింది. పిటిషనర్ తరపున్యాయవాది సంజయ్ పారిక్ అంతకంటే ముందే విచారణ చేపట్టాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20 వాయిదా వేసింది.