రాష్ట్రీయం

బిరబిరా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృష్ణమ్మ తరలివచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణాపుష్కరాలకు కూడా నీరులేదన్న బెంగ అవసరం లేదు. కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్‌మట్టి పరీవాహక ప్రాంతం నుండి కృష్ణానదిలోకి భారీగా వరద చేరుతోంది. ఇప్పటికే ఆల్‌మట్టి నిండిపోయింది. ఈ జలాశయానికి ప్రమాదం ఏర్పడకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాజెక్టుకు ఉన్న అన్ని గేట్లు సంబంధిత ఇంజనీర్లు ఎత్తివేసి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి వదులుతున్నారు. మరో 24 గంటల్లో నారాయణపూర్ జలాశయం కూడా పొంగిపొర్లుతుందని వాస్తవపరిస్థితి వెల్లడిస్తోంది. శనివారం అర్థరాత్రి తర్వాత ఏ క్షణాన్నైనా వరదనీటిని కిందకు వదిలివేసే అవకాశం ఉందని కర్నాటక నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా తెలిసింది. నారాయణపూర్ నుండి నీటిని వదిలివేస్తే ఈ నీరు జూరాలకు మూడునాలుగు రోజుల్లో చేరుతుందని తెలంగాణ భారీనీటిపారుదల శాఖ ఈఎన్‌సి సిహెచ్ మరళీధర్ తెలిపారు. నారాయణపూర్ నుండి అదనపునీటిని విడుదల చేస్తే ఈనీరు నేరుగా జూరాల చేరుతుంది. జూరాలలో నీటినిలువ సామర్థ్యం కేవలం 11 టిఎంసిలే కావడం వల్ల ఈ జలాశయంలోకి వచ్చే నీటిని యథాతథంగా దిగువకు వదిలివేస్తే, ఈ నీరు శ్రీశైలానికి చేరుతుంది. శనివారం అందిన సమాచారం ప్రకారం ఆల్‌మట్టిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా వరద ఆల్‌మట్టిలోకి చేరుతోంది. ఆల్‌మట్టిలో పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 129 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 105 టిఎంసిలను నిలిపారు. భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు రక్షణ దృష్ట్యా పూర్తిస్తాయిలో నీటిని నిలపకుండా, అదనపు నీటిని కిందకు వదిలివేస్తున్నారు. శనివారం సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఆల్‌మట్టి ప్రాజెక్టుకు ఉన్న 22 గేట్లను ఎత్తివేసి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం నిలువనీటి సామర్థ్యం 37 టిఎంసిలుగా కాగా తాజా సమాచారం ప్రకారం నీటిమట్టం 18 టిఎంసిలుగా ఉంది. శుక్రవారం వరకు ఈ ప్రాజెక్టులోకి 23 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా నిలువ చేస్తున్నారు. శనివారం అర్థరాత్రి తర్వాత నారాయణపూర్‌లోకి 1,30,000 క్యూసెక్కులు వస్తోంది. అందువల్ల శనివారం అర్థరాత్రి తర్వాత నారాయణపూర్ నుండి అదనపు నీటిని జూరాలకు వదిలివేసే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి ఒకరు ఆంధ్రభూమితో చెప్పారు. జూరాలకు చేరే వరద ఒకటి రెండురోజుల తర్వాత శ్రీశైలం చేరుతుంది.
ఇలాఉండగా తుంగభద్ర నుండి ఇప్పుడప్పుడే వరద నీరు మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు లేవు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఒక మోస్తరుగా ఉండటంతో కేవలం 16 వేల క్యూసెక్కులే చేరుతోంది. తుంగభద్ర జలాశయంలో నిలువనీటి సామర్థ్యం 100 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 36 టిఎంసిలే ఉంది. తుంగభద్ర నిండేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇక నుండి కర్నాటకలోని ఆల్‌మట్టి పరీవాహక ప్రాంతంలో కురిసే వర్షపునీరు మన రాష్ట్రానికి చేరేందుకు మార్గం సుగమమైంది.