రాష్ట్రీయం

జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రతో పరిష్కారం కాని సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం రాష్టప్రతి భవన్‌లో జరిగిన 11వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో మాట్లాడుతూ కొత్త రాష్టమ్రైన తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో కలిసి మెలిసి ఉంటోందన్నారు. గోదావరి జలాలపై మహరాష్టత్రో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. అలాగే మంచినీటి కోసం కర్నాటకతో అవగాహనకు వచ్చామని వివరిస్తూనే, ఆంధ్రతో మాత్రం కొన్ని వివాదాస్పద అంశాలపై గొడవ కొనసాగుతూనే ఉందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రతో సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర శాసన సభల స్థానాల సంఖ్య పెంచేందుకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచేందుకు, ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచేందుకు కేంద్ర చట్టంలో తగు మార్పులు చేర్పులు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత అవగాహన పెరిగేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని కెసిఆర్ సూచించారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులు కొంత పెరిగినా, ఇవి మరింత పెంచాలన్నారు. నీటిపారుదలు, విద్య, వైద్యం, ఆరోగ్యరంగాలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి రాష్ట్రంనుంచి ఒక జాతీయ ప్రాజెక్టు ఉండాలని, కేంద్రం ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన పథకాలకు సాయం యథావిధిగా కొనసాగించాలన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలను కేంద్రం తనంతతాను అదుపుచేసే విధానం పోవాలని స్పష్టం చేశారు. ఏఐసిటిఇ ఏకపక్షంగా వ్యవహరించటాన్ని నిలిపివేయాలని, యుజిసి నిధులను రాష్ట్రాల పరిధిలోని వర్శిటీలకూ తగు మోతాదులో కేటాయించాలని సూచించారు. గవర్నర్ల ఎంపికలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాలన్న పూంచ్ కమిషన్ సిఫార్సును సమర్థిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం పంపించే బిల్లుల విషయంలో గవర్నర్లకు ఏకపక్ష అధికారాలు ఉండకూడదన్నారు. గవర్నర్లను వర్శిటీల ఛాన్స్‌లర్లుగా నియమించకూడదనే సిఫార్సును కెసిఆర్ సమర్థించారు. అంతర్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంభించాలన్నారు. అంతర్ రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన ట్రిబ్యునల్ తమ అవార్డులను నిర్ణీత గడువులోగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించే నిధులు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించాలని ప్రతిపాదించారు. లబ్దిదారులకు రాయితీలను ఆధార్ ఆధారంగా ఇవ్వటాన్ని కెసిఆర్ సమర్థించారు. విద్యారంగాన్ని సంస్కరించాలని, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు కేంద్రం అదనపు సాయం అందించాలని సూచించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద కేంద్ర బలగాల మోహరింపు మరింత పటిష్టం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చేందుకు అంతర్ రాష్ట్ర మండలి ముఖ్యమైన వేదిక కావాలని అభిలషించారు. బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి సాధ్యమని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.
జ్వరంతో మధ్యలోనే నిష్క్రమణ
జ్వరం కారణంగా సిఎం కెసిఆర్ మండలి సమావేశంలో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. సమావేశం తేనీటి విరామం తీసుకోగానే కెసిఆర్ తన ప్రసంగ పాఠాన్ని టేబుల్ చేసిన అనంతరం నిష్క్రమించారు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్టప్రతి భవన్‌లో అంతర్ రాష్ట్ర మండలి సమావేశానికి హాజరయ్యారు. సిఎస్ రాజీవ్ శర్మ సైతం ఆయనతోపాటు ఉన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ప్రాధాన్యత తదితర అంశాలపై వివరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. తరువాత తేనీటి విరామం ప్రకటించారు. ఈ సమయంలో కెసిఆర్ మోదీతో కొద్దిసేపు మాట్లాడి, అనారోగ్యం కారణంగా సమావేశంలో పూర్తి సమయం ఉండలేనని చెప్పారు. అనంతర సమావేశానికి హాజరైన సిఎస్, వివరాలను సిఎం కెసిఆర్‌కు అందించారు.