రాష్ట్రీయం

టోలిచౌకిలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 16: టోలిచౌకిలో దారుణం జరిగింది. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ప్రాణాల పైకి వచ్చింది. విద్యార్థుల గొడవలో గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈనెల 12న విద్యార్థుల మధ్య మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఘర్షణ చోటుచేసుకోగా చిన్నారి మృతితో ఈ ఘటన వెలుగుచూసింది. టోలిచౌకికు చెందిన అబ్దుల్ ముజీబ్ క్యాబ్‌డ్రైవర్. ఇతని కుమారుడు ఇబ్రహీం (6) ప్రామిసింగ్ స్కాలర్ హైస్కూల్‌లో ఫస్ట్‌క్లాస్ చదువుతున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇబ్రహీంను మూడో తరగతి చదువుతన్న విద్యార్థి వృషణాలు, ఛాతీపై తన్నడంతో అస్వస్తతకు గురయ్యాడు. ఇంటికి చేరుకున్న ఇబ్రహీం నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన ఘటనను రోదిస్తూ చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు ఇబ్రహీంను నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు వృషణాలు దెబ్బతిన్నాయని గుర్తించి రెండు పర్యాయాలు ఆపరేషన్లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. నిలోఫర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఇబ్రహీం శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ ఇనె్స్పక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు.

చిత్రం.. మృతుడు ఇబ్రహీం