రాష్ట్రీయం

రెండు కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి అడ్మిషన్లకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఉన్నత విద్యామండలి శనివారం నాడు పూర్తి చేసింది. రెండు కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు జరగ్గా, మూడు కాలేజీల్లో 9లోపు అడ్మిషన్లు జరిగాయి. ఈ మూడు కాలేజీల్లో కూడా సీట్లు కేటాయించిన విద్యార్థులు వాటిని వదిలి వేరే కాలేజీలవైపు చూస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలో 1,11,461 మంది అర్హత సాధించగా, 68,296 మంది సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో సీట్లకు 66,566 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఒక విద్యార్థి గరిష్ఠంగా 848 ఆప్షన్లు ఇవ్వగా, ఒక విద్యార్ధి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు. కన్వీనర్ కోటాలో 69,123 సీట్లు అందుబాటులో ఉండగా తొలి దశలో 57940 మందికి సీట్లు కేటాయించారు. 11,183 సీట్లు మిగిలిపోయాయి. 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3040 సీట్లకు కేటాయింపులు జరగ్గా. 184 ప్రైవేటు కాలేజీల్లో 63,655 సీట్లకు 54,749 సీట్లు కేటాయించారు. ఇక మూడు యూనివర్శిటీ ఫార్మసీ కాలేజీల్లో 80 సీట్లలో 36 సీట్లు కేటాయించారు. 78 ప్రైవేటు కాలేజీల్లో 2058 సీట్లకు 80 మందికి సీట్లు కేటాయించారు. ఫార్మాడి ఆఫర్ చేస్తున్న 29 కాలేజీల్లో 290 సీట్లకు గానూ 35 సీట్ల కేటాయింపు జరిగింది. మొత్తం మీద 308 కాలేజీల్లో 69,123 సీట్లకు 57940 సీట్లు భర్తీ కాగా, 11,183 సీట్లు మిగిలిపోయాయి.
8626 మందికి సీట్లు హుళక్కే
సరైన సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 8626 మందికి సీట్ల కేటాయింపు జరగలేదు. దాంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చాలా తక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారికి సీట్ల కేటాయింపు జరగలేదని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. కొంత మంది వందల సంఖ్యలో ఆప్షన్లు పెట్టినా, తాము వస్తుందనుకున్న కాలేజీల్లో రాకపోవడంతో హతాశులయ్యారు. మంచి ర్యాంకులు సాధించి మంచి కాలేజీల్లో సీట్లు పొందుతామనుకున్న విద్యార్ధులు తీరా సీట్ల కేటాయింపు తర్వాత కేటాయింపులు చూసి నిరాశకు గురయ్యారు. 8626 మందికి సీట్లు దక్కలేదు. దీనికి కారణం పదే పదే సూచించినా, అభ్యర్ధులు సాంకేతికంగా ఆప్షన్లు ఇవ్వకపోవడమేనని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొంత మంది 10 నుండి 20 ఆప్షన్లు ఇచ్చి ఊరుకోవడంతో వారికి సీట్లు దక్కలేదని, మంచి ర్యాంకు సాధించినా సరిపడా సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సీట్లు పొందిన వారు 21వ తేదీలోగా ఫీజు చెల్లించి , 22 తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కమిషనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు.