రాష్ట్రీయం

వైద్య రంగానికి నిధులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగానికి 157 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసే పరికరాలను కొనుగోలు చేసేందుకు, పాతవాటికి మరమ్మతులు చేసేందుకు వీలుగా 144 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే ఈ దవాఖానాల్లో ప్రాణాలను రక్షించే మందులను (అత్యసర మందులు) కొనుగోలు చేసేందుకు మరో 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నేతృత్వంలోని పిల్లల దవాఖానాల్లో అప్పుడే పుట్టిన బిడ్డల సంరక్షణకు అవసరమైన పనిముట్లను కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేశారు.