రాష్ట్రీయం

సంక్షోభాల నుంచి పాఠాలు నేర్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ప్రజల అవసరాలకు అనుగుణంగా మైక్రోఫైనాన్స్ కంపెనీలు తమ రుణ విధానాన్ని రూపొందించుకోవాలని, లేనిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో తలెత్తిన సంక్షోభాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన కోరారు. మంగళవారం ఇక్కడ మైక్రోఫైనాన్స్ సంస్థలపై అసోచామ్ నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు దేశంలో కేంద్రం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పుంజుకుందన్నారు. దీనికి తగ్గట్టుగా గ్రామీణ ప్రజలకు నైపుణ్యం పెంపుపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఇష్టం వచ్చినట్లు వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారుడి తత్వాన్ని ప్రజల్లో పెంపొందించరాదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆర్థికపరంగా లోటు, ఆగాధం పెరిగిందన్నారు. ఈ లోటును పూడ్చేవిధంగా మైక్రోఫైనాన్స్ సంస్థలు కృషి చేయాలన్నారు. ఆర్థిక విధానాల అమలులో ప్రజలను భాగస్వాములను చేయాలని, తద్వారా సమీకృత ఆర్థికాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఎంపిక చేసిన రంగాలపై శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. 2010 నాటి ఆర్థిక మాంద్యం, మైక్రోఫైనాన్స్ సంక్షోభం మళ్లీ సంభవించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలు మితిమీరడంతో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాల నియంత్రణకు ఆర్డినెన్స్‌ను జారీ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఐటి రంగంలో చేపట్టిన విధానాలను వివరించారు. అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా మానవ దృక్పథంతో మైక్రోఫైనాన్స్ సంస్థలు వ్యవహరించాలని హితవుచెప్పారు.

మైక్రోఫైనాన్స్ సంస్థలపై అసోచామ్ నిర్వహించిన
జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్