రాష్ట్రీయం

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ షీట్లు, రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసే బట్టలు చేనేత కార్మికుల నుంచి ఖరీదు చేసి వారిని ఆదుకోవాలని అసెంబ్లీ అంచనాల కమిటీ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్-టెక్స్‌టైల్ పరిశ్రమను మరింత పటిష్టవంతం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది 70 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించినా, చివరకు 30 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అప్కొ టిస్కొగా మారిందని వారు వివరించారు. చైర్మన్ రామలింగారెడ్డి మాట్లాడుతూ హ్యాండ్లూమ్ షోరూంలను ఇంకా పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వంటి ప్రభుత్వ వసతి గృహాల్లో తప్పని సరిగా చేనేత వస్త్రాలు సరఫరా చేయించి తద్వారా చేనేత కార్మికులను ఆదుకోవాలని అన్నారు.