రాష్ట్రీయం

ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీక్‌పై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ఎమ్సెట్-2 పేపర్ లీక్ ఘటనపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనపై ఎమ్సెట్ కన్వీనర్ రమణారావు తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కలసి సిఐడి దర్యాప్తు జరిపించాలని కోరిన సంగతి తెలిసిందే. డిజిపి ఆదేశానుసారం సిఐడి దర్యాప్తును చేపట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకర్లకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల కాల్ డేటాను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ దిశగా సిఐడి దర్యాప్తు జరుపుతోంది. జెఎన్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైందంటూ వచ్చిన ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు నిర్వహించినప్పటికీ పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.దీంతో ఎంసెట్ కన్వీనర్ డిజిపిని కలసి సిఐడి విచారణను కోరారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి.
మెరిట్ విద్యార్థులు తమ భవిష్యత్ ఏమైపోతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.