రాష్ట్రీయం

ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల పరిపాలన సమర్థవంతంగా ఉండేందుకు వీలుగా వెంటనే ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్‌లోని సంతోషిమాత ఆలయంలో గురువారం జరిగిన బ్రాహ్మణ పరిషత్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధార్మిక పరిషత్ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మికవేత్తలతో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆలయాల పాలనలో సంస్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ నిధులు వ్యయం చేసేందుకు వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అర్చక సంక్షేమం కోసం కేటాయించిన 87 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు అర్చక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. బంగారు తెలంగాణ సాధనలో బ్రాహ్మణులంతా భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. ఆగస్టు రెండోవారంలో రాష్ట్ర స్థాయిలో రెండులక్షల మందితో హైదరాబాద్‌లో బ్రాహ్మణ సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామన్నారు. హైదరాబాద్‌లో దేవాదాయ శాఖకు చెందిన దాదాపు10 వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడు రామశర్మ ప్రభుత్వాన్ని కోరారు.

చిత్రం..గురువారం జరిగిన బ్రాహ్మణ పరిషత్ సమావేశంలో ప్రసంగిస్తున్న
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ