రాష్ట్రీయం

ఎమ్సెట్-3కి రోడ్‌మ్యాప్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ఎమ్సెట్-3 నిర్వహణకు జెఎన్‌టియు రోడ్‌మ్యాప్ ఖరారు చేసింది. ఎమ్సెట్-2 పరీక్ష రద్దయిన పక్షంలో ప్రభుత్వం ముందు ఉంచేందుకు వీలుగా ఎమ్సెట్-3కి ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు తెలిసింది. ఎమ్సెట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మెడికల్ కౌనె్సలింగ్ నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) ఇదివరకే మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి దశ కౌన్సిలింగ్ జూన్ 25లోగా, రెండవ దశ కౌనె్సలింగ్ జూలై 27లోగా, మూడవ దశ కౌనె్సలింగ్ సెప్టెంబర్ 10 లోగా నిర్వహించి ఎంబిబిఎస్ ప్రవేశాల ప్రక్రియను సెప్టెంబర్ 17 లోగా పూర్తి చేయాలని ఎంసిఐ సూచించింది. ఎంసిఐ ఖరారు చేసిన ఈ షెడ్యూల్ మేరకు మరో 50 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. ఎంసెట్-3 నిర్వహించాల్సి వచ్చే పక్షంలో ఈ ప్రక్రియను సెప్టెంబర్ 10 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకునే జెఎన్‌టియు రోడ్‌మ్యాప్ తయారు చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ రంజన్ ఆచార్య, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి హాజరుకానున్నారు.