రాష్ట్రీయం

విసిల నియామకం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఏపి వర్శిటీల చట్టానికి సవరణలు చేసిన తర్వాత ఈ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మూడు జీవోలను జారీ చేశారని, ఇది అక్రమమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఏవి శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అనంతరం నాలుగు వారాల పాటు తన తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపి వర్శిటీల చట్టానికి సవరణలు చేస్తూ గవర్నర్ అధికారాలను అపహరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా యూనివర్శిటి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి మనోహర్‌రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్శిటీల వైస్‌చాన్సలర్ల నియామకంపై హైకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా, రాష్ట్రప్రభుత్వం తొందరపాటుతో జీవో ఎందుకు జారీ చేసిందని కోర్టు ప్రశ్నించింది. రెండేళ్లుగా విసిల నియామకంలో జాప్యం జరుగుతుంటే, కొన్ని రోజుల పాటు ప్రభుత్వం ఎందుకు వేచిచూడలేకపోయిందని కోర్టు ప్రశ్నించింది. గవర్నర్ ప్రమేయం లేకుండా ప్రభుత్వమే విసిలను నియమించే విధానం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, పంచాయితీరాజ్ బోర్డు సభ్యులు, ఎన్నికల్లో ఓటమి చెందిన వారిని కూడా విసిలుగా నియమించే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.