రాష్ట్రీయం
బలరాముడిగా భద్రాద్రి రామయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 December 2015
భద్రాచలం, డిసెంబర్ 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి శుక్రవారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. కల్యాణ మండప వేదిక వద్ద భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు.
భారీగా తరలివచ్చిన భక్తులు బలరామావతారంలో రామయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామికి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. దారిపొడవునా మహిళలు స్వామికి ఎదురేగి నీరాజనాలు పలికారు.
బలరామావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య