రాష్ట్రీయం

రాష్ట్ర పాలన దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావించి హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, తెదేపా కార్యకర్తలను అడ్డుపెట్టుకుని పాలిస్తున్న తీరు, బాక్సైట్ తవ్వకాలకు అనుసరించే అక్రమ విధానాలు, అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిన తీరుపై రాష్టప్రతికి సమర్పించిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్టప్రతిని ఇక్కడ బొల్లారంలోని రాష్టప్రతి శీతాకాలం విడిదిలో కలిశారు. తెదేపా కార్యకర్తలను ఉసిగొల్పి రాష్ట్రంలో బీభత్స వాతావరణం సృష్టిస్తున్నారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తెదేపా కార్యకర్తలను అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని ఆదేశించారన్నారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ కార్యకర్తలను సంతృప్తిపర్చడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ మాఫియా విజృంభించిందన్నారు. తాజాగా రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ ఫైనాన్స్ సెక్స్ రాకెట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. సిఎం పరిపాలనకు కేంద్ర బిందువైన విజయవాడ నేర రాజధానిగా మారిందన్నారు. కాల్‌మనీ రాకెట్‌లో తల్లీకూతుళ్లను వ్యభిచారం రొంపిలోకి వడ్డీ వ్యాపారులు దింపారన్నారు. 30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. వడ్డీ చెల్లించని మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్నారు. నిందితులతో సిఎం చంద్రబాబు దిగిన ఫోటోలను రాష్టప్రతికి అందించారు. అదనపు డిజి నిఘా విభాగం అధికారి కూడా నిందితులతో కలిసివున్న ఫోటోలను అందించారు. ఒక ఎమ్మెల్యే నిందితుడితో కలిసి విదేశాలకు వెళ్లివచ్చినా ఇంతవరకు చర్యలు లేవన్నారు. ఒక తెదేపా ఎమ్మెల్సీ సోదరుడు కాల్‌మనీ రాకెట్‌లో ఉన్నారన్నారు. రాష్ట్ర డిజిపి ఒక ఇంటర్వ్యూలో ఈ కేసులోని తెదేపా ప్రజాప్రతినిధులకు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకుని పోలీసులు దాడులు చేసేలా సిఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కాల్‌మనీ రాకెట్ పేరిట ఎంపిక చేసిన కొద్దిమందిపై దాడులు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు అధికార పార్టీ అనుమతించలేదన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారన్నారు. అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష పార్టీ సభ్యులను దూషించేవిధంగా అధికార పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. శాసనసభ 342 నిబంధనలను అధికార పార్టీ, స్పీకర్ ఉల్లంఘించారన్నారు. తమ ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని ప్రభుత్వం పేర్కొందన్నారు. అసెంబ్లీ పవిత్రతను కాపాడేలా స్పీకర్ వెంటనే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను తొలగించేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
విశాఖ ఏజన్సీలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ ఈ విషయంలో ఇంతవరకు రాష్ట్రప్రభుత్వ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదన్నారు. గిరిజన హక్కులను కాలరాచేలా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంటు వేదికగా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని కేంద్రం నిలుపుకోలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంతవరకు కేంద్రంపై ఈ అంశంపై ఎటువంటి వత్తిడి తేలేదన్నారు. ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్టప్రతిని జగన్మోహన్ రెడ్డి కోరారు.

చిత్రం... చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేస్తూ రాష్టప్రతి ప్రణబ్‌కు
విజ్ఞాపనప్రతం అందిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి